నమస్తే శేరిలింగంపల్లి: హపీజ్‌పేట్ సెక్షన్ జలమండలి అధికారులతో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ బుధవారం ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా గాంధీ మాట్లాడుతూ ఎక్కడైనా మంచి నీటి సమస్య తలెత్తిన వెంటనే ఇతర విభాగాల సిబ్బందిని సమన్వయం చేసుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా సమస్యను పరిష్కరించాలని అన్నారు. కేసీఆర్ కలల ప్రాజెక్ట్ అయిన మిషన్ భగీరథ ద్వారా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో చేపట్టిన 18 రిజర్వాయరాలను నీటి సరఫపరాపై సమీక్షించారు. ఎక్కడైనా మిగిలిపోయిన ప్రాంతలు, నెట్వర్క్ లేని ప్రాంతాలు, కలుషిత ప్రాంతాలు, రీప్లేస్మెంట్ చేయాల్సిన ప్రాంతాలను, నివాసయోగా ప్రాంతాలను, కొత్తగా విస్తరించిన, ఈ మధ్య ఏర్పడిన కాలనీలను గుర్తించి మంచి నీటి సమస్య లేకుండా తగు చర్యలు తీసుకోవలసిందిగా అధికారులను ఆయన సూచించారు. ప్రతి డివిజన్లలో విస్తరించిన కొత్త ప్రాంతలను ఆయా డివిజన్ల కార్పొరేటర్ల ద్వారా సమాచారం తీసుకొని, ప్రతిపాదిత పనుల కొరకు అంచనాలు తయారు చేయాలని అన్నారు. భవిష్యత్తులో నీటి సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. 20 వేల లీటర్ల ఉచిత మంచి నీటి పథకం అర్హులైన వినియోగదారులకు చేరువయ్యేలా చూడలని, ప్రతీ ఇంటికి స్వచ్ఛమైన తాగు నీరు అందించేవిధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో డీజీఎం నాగప్రియ, మేనేజర్లు పూర్ణేశ్వరి, సాయి చరిత, సునీత తదితరులు పాల్గొన్నారు.