నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్లోని రంగారెడ్డి జిల్లా దవాఖానాలో గురువారం కోవిడ్ వ్యాక్సినేషన్ రెండవ డోసు పంపిణీ కొనసాగుతుందని సూపరింటెండెంట్ వరదాచారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 45 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే అర్హులని, కోవాక్జిన్ ఒకటవ డోసు తీసుకొని 28 రోజుల గడువు ముగిసిన వారు అదేవిధంగా కోవీషీల్డ్ వ్యాక్సిన్ తీసుకుని 84 రోజులు పూర్తయిన వారికి మాత్రమే రెండవ డోసు ఇవ్వబడుతుందని తెలిపారు. ఇందుకోసం కోవిన్ యాప్లో ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని, మొదటి డోసు తీసుకుని గడువు ముగిసిన వారు నేరుగా హాస్పిటల్కు రావచ్చునని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని వరదాచారి తెలిపారు. రంగారెడ్డి జిల్లాకు చెంది, కోవాక్జిన్, కోవీషీల్డ్ రెండవ డోసుకు అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా సూపర్ స్ప్రెడర్స్ కేటగిరి వారికి జీహెచ్ఎంసీ వారి జాబితా ప్రకారం మొదటి డోసుగా కోవీషీల్డ్ వ్యాక్సిన్ ఇవ్వబడుతుందని తెలిపారు. ఇతరులు హాస్పిటల్కు వచ్చి ఇబ్బందులకు గురికావద్దని వారు సూచించారు.