గంగారం బ‌స్తీలో ప‌ర్య‌టించిన కార్పొరేట‌ర్ జ‌గదీశ్వ‌ర్ గౌడ్… స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి హామీ…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: హ‌ఫీజ్‌పేట్ డివిజ‌న్ ప‌రిధిలోని గంగారం బ‌స్తీలో మాదాపూర్ కార్పొరేట‌ర్ వి.జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్ గురువారం ప‌ర్య‌టించారు. స్థానికంగా నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను బ‌స్తీవాసుల‌ను అడిగి తెలుసుకున్నారు. ప్ర‌ధానంగా రోడ్లు, భూగ‌ర్భ‌డ్రైనేజీ, స‌మ‌స్య‌ను బ‌స్తీవాసులు కార్పొరేట‌ర్ దృష్టికి తీసుకువ‌చ్చారు. దీంతో సానుకూలంగా స్పందించిన కార్పొరేట‌ర్ జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్ మాట్లాడుతూ ఇప్ప‌టికే ఆయా అభివృద్ధి ప‌నుల‌ను నిధులు మంజూర‌య్యాయ‌ని, స‌మ‌స్య తీవ్రీత‌ను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వ‌రితగ‌తిన ప‌నులు పూర్త‌య్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్య‌క్ర‌మంలో స్థానికులు యాద‌య్య‌, పెంట‌య్య‌, రాజేష్‌, శేఖ‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

కార్పొరేటర్ జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్‌కు స‌మ‌స్య‌ల‌ను వివ‌రిస్తున్న గంగారం బ‌స్తీ వాసులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here