దేశంలోనే నంబర్‌-1 మంత్రి కిషన్‌రెడ్డి.. కేంద్ర పనితీరు ర్యాంకుల్లో అగ్రస్థానం..

శేరిలింగంప‌ల్లి, మే 26 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కేంద్ర మంత్రుల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ఫైల్స్ క్లియరెన్స్ తదితర అంశాల ఆధారంగా రూపొందించిన ర్యాంకింగ్స్‌లో కేంద్ర మంత్రి జి.కిష‌న్ రెడ్డి దేశవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలవడం అభినందనీయమని బీజేపీ రాష్ట్ర నాయ‌కుడు క‌సిరెడ్డి భాస్క‌ర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గ సభ్యుల పనితీరుపై కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి సోమనాథ్ విడుదల చేసిన అధికారిక ర్యాంకుల జాబితాలో కిషన్‌రెడ్డి తొలి వరుసలో నిలిచారని తెలిపారు. ప్రజా సేవలో ఆయన చూపుతున్న నిబద్ధత, నిజాయితీ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో సమర్థత, ప్రజలతో నిరంతర అనుసంధానం కారణంగానే ఈ గుర్తింపు దక్కిందన్నారు. దేశస్థాయిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకుడు అగ్రస్థానంలో నిలవడం ప్రతి తెలుగు వ్యక్తికి గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా కిషన్‌రెడ్డి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here