శేరిలింగంపల్లి, మే 26 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నారాయణ్ అమిత్ ని శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి డివిజన్‌కు సంబంధించిన పలు ప్రజా సమస్యలను జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా డివిజన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న మౌలిక వసతుల సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాగం నాగేందర్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన జోనల్ కమిషనర్ సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.






