నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గం ఒయాసిస్ స్కూల్‌లో 12వ తెలంగాణ స్టేట్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ 2021 నేషనల్ టీం సెలెక్షన్స్ సోమవారం జరిగాయి. సీనియర్స్, మాస్టర్స్, మెన్, విమెన్ విభాగాలకు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, సీనియర్ నాయకులు కృష్ణ యాదవ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు బంగారు, రజతం, కాంస్య పతకాలు, ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ గచ్చిబౌలి డివిజన్‌లో ఈ పోటీలు నిర్వహించటం చాల సంతోషంగా ఉందని అన్నారు. క్రీడలంటే తనకు చాలా ఆసక్తి అని, డివిజన్‌తో పాటు జిల్లా స్థాయి పోటీలకు తన ప్రోత్సాహం ఉంటుందని, ప్రతిభగల క్రీడాకారులకు ఎలాంటి సహాయానికి అయినా ముందు ఉంటానని హామీ ఇచ్చారు. పోటీల్లో గెలుపు ఓటములు సహజమని, విజయం సాధించిన వారికి అభినందనలు దక్కితే, ఓటమి పాలైన క్రీడాకారులకు అనుభవం వస్తుందని, ఈ క్రమంలో వారు కుంగిపోవద్దని అన్నారు. క్రమశిక్షణ గల క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని. కష్టపడి సాధన చేస్తే పీవీ సింధు, నీరజ్ చోప్రా, మీరాబాయ్ చానులా దేశం గర్వించే స్థాయికి ఎదుగుతారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు రామాంజనేయులు, జనరల్ సెక్రెటరీ మహిపాల్, రంగారెడ్డి జిల్లా కిక్ బాక్సింగ్ అధ్యక్షుడు నర్సింగ్ రావు, జనరల్ సెక్రెటరీ ప్రవీణ్ కుమార్, రిఫరీస్ బాలాజీ, ప్రవీణ్ కుమార్, స్వామి, నర్సింగ్ రావు, శ్రీ రామ్, నాయకులు కృష్ణ ముదిరాజ్, నాగం తిరుపతి రెడ్డి, బండారి విఠల్, రవీందర్ రెడ్డి, వెంకటేష్, దయాకర్, రాఘవేంద్ర, శివ సింగ్, శ్యామ్ యాదవ్, రంగస్వామి, నర్సింగ్ రావు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
