నమస్తే శేరిలింగంపల్లి:మాదాపూర్,హఫీజ్ పేట్ డివిజన్లను శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని అన్ని డివిజన్ల కంటే అభివృద్ధిలో ముందు వరుసలో నిలుపుతామని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. మంగళవారం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీని కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ కలిసి డివిజన్ లలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై వినతి పత్రాన్ని అందజేశారు. మాదాపూర్, హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలో నూతనంగా చేపట్టాల్సిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను మంజూరు చేయాలని, పెండింగులో ఉన్న పనులపై, నూతనంగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ ఎమ్మెల్యే గాంధీ దృష్టి కి తీసుకెళ్లారు.
