నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి జోన్ లో జీహెచ్ఎంసీ నుండి జలమండలికి బదిలీ అయిన లింగయ్య గౌడ్, శ్రీకాంత్, చందు, రమేష్, పద్మరావు, గణేష్, రవి, ప్రకాష్ లను జేఏసీ చైర్మన్ తిప్పర్తి మహేష్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సత్కరించారు. జీహెచ్ఎంసీలో ప్రజలకు అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. జలమండలిలోనూ విశిష్ట సేవలందించి ఉన్నతాధికారుల మన్ననలు, ప్రజల మెప్పు పొందాలని జేఏసీ చైర్మన్ తిప్పర్తి మహేష్ ఆకాంక్షించారు. తెలంగాణా మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగం, కార్మిక సంఘం తరపున శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగ, కార్మిక సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు నాగేశప్ప, ఉపాధ్యక్షుడు బిక్షపతి గౌడ్, అచ్యుత్, జోన్ ప్రెసిడెంట్ నారాయణస్వామి నాయక్, ప్రధానకార్యదర్శి గురుచరణ్, శేరిలింగంపల్లి సర్కిల్ ప్రెసిడెంట్ యాదయ్య, చందానగర్ సర్కిల్ ప్రధానకార్యదర్శి నాగరాజు, కృష్ణంరాజు, శివకుమార్, హెచ్ ఎం ఈ ఎస్ అండ్ ఎస్ బి సిబ్బంది లింగయ్య, శ్రీకాంత్, చందు తదితరులు పాల్గొన్నారు.
