కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన మోతి కుమార్ కు త్రివేణి విద్యాసంస్థల ఘన సన్మానం

నమస్తే శేరిలింగంపల్లి: పట్టుదల, నిరంతర శ్రమ ఉంటే సాధించలేనిదంటూ ఏదీ ఉండదని,‌ కిలి మంజారో పర్వతాన్ని అధిరోహించడం అభినందనీయమని మియాపూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ తిరుపతి రావు అన్నారు. త్రివేణి విద్యాసంస్థలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బి. మోతి కుమార్, ఏప్రిల్ నెల 5వ తేదీన దక్షిణాఫ్రికాలోని టాంజానియా లో ఉన్న మౌంట్ కిలిమంజారో పర్వతాన్ని దిగ్విజయంగా అధిరోహించి భారతీయ పతాకాన్ని, త్రివేణి విద్యాసంస్థల పతాకాన్ని ఎగరేసి దిగ్విజయంగా తిరిగి హైదరాబాద్ చేరుకున్న సందర్భంగా మియాపూర్ లోని త్రివేణి విద్యా సంస్థ ప్రాంగణంలో అభినందన సభను ఏర్పాటు చేశారు. మియాపూర్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ తిరుపతి రావు,త్రివేణి విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి ముఖ్య అతిథులుగా హాజరై మోతి‌ కుమార్ ను సన్మానించారు. ఈ సందర్భంగా తిరుపతి రావు మాట్లాడుతూ పర్వతారోహణ చేయటం అద్భుతమైన పట్టుదల కృషి తో మాత్రమే సాధ్యమని అన్నారు. ప్రపంచంలో మరిన్ని ప్రఖ్యాత గాంచిన పర్వతాలను నిరంతర శ్రమతో దిగ్విజయంగా అధిరోహించి దేశానికి, పనిచేస్తున్న సంస్థకు, తల్లిదండ్రులకు, స్వగ్రామానికి మోతి కుమార్ మరింత పేరు తీసుకు రావాలని ఆకాంక్షించారు. త్రివేణి విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ వీరేంద్ర చౌదరి మాట్లాడుతూ కిలిమంజారో పర్వతారోహణ అనేది పర్వతారోహకుల కళ అని, కృషి పట్టుదల నిరంతర శ్రమతో ఈ ప్రయత్నంలో విజయం సాధించడం గర్వకారణమన్నారు. భవిష్యత్తులో మోతి కుమార్ చేసే పర్వతారోహణ యాత్రలో త్రివేణి విద్యాసంస్థల నుంచి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. మోతి కుమార్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని, విద్యార్థులకు ఉపాధ్యాయులకు సమాజానికి స్ఫూర్తినిచ్చే పర్వతారోహణ చేసినందుకు మోతి కుమార్ ను అభినందించారు. మోతి కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుండి ఔత్సా హిక పర్వతారోహకుడునని, ఏప్రిల్ 5న దక్షిణాఫ్రికాలోని ప్రతిష్ఠాత్మక కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి ప్రతీకగా భారతీయ జెండాని, ఎంతో మంది విద్యార్థులకు 28 సంవత్సరాలుగా నిరంతరాయంగా విద్యా సేవలందిస్తున్న త్రివేణి స్కూల్స్ పై ఉన్న గౌరవార్థం త్రివేణి విద్యాసంస్థల జెండాని ప్రతిష్టించడం జరిగిందన్నారు. తనకు సహకరించిన త్రివేణి స్కూల్ యాజమాన్యానికి, డైరెక్టర్ డా.వీరేంద్ర చౌదరి, శ్రేయోభిలాషులకు, మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఏసి నట్ రాజ్, సిఆర్ఓ లు సాయి నరసింహారావు వెంకట్రావు, సుబ్బారావు సత్తుపల్లి బ్రాంచ్ ప్రిన్సిపాల్ వేణు గోపాల్, విద్యాసంస్థల పీఈటీలు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

కిలీ మంజారో పర్వతాన్ని అధిరోహించిన మోతి‌ కుమార్ ను సన్మానిస్తున్న మియాపూర్ సీఐ తిరుపతి రావు, త్రివేణి విద్యా సంస్థల డైరెక్టర్ వీరేంద్ర చౌదరి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here