మాస్టర్ అథ్లెటిక్స్ కు‌ రంగారెడ్డి జిల్లా మాస్టర్ అథ్లెట్ అసోసియేషన్ సన్మానం

నమస్తే శేరిలింగంపల్లి: ఇటీవల జరిగిన మాస్టర్స్ రాష్ట్ర స్థాయి పోటీల్లో రంగారెడ్డి జిల్లా మాస్టర్స్ ప్రతిభ కనబరచడం అభినందనీయమని రంగారెడ్డి జిల్లా‌ మాస్టర్ అథ్లెట్ అసోసియేషన్ అధ్యక్షుడు‌ కొండా‌ విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి నూనె సురేందర్ అన్నారు. మాస్టర్స్ రాష్ట్ర స్థాయి పోటీల్లో రంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్ అథ్లెట్స్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పతకాలను అందుకున్న శుభసందర్భంగా చందానగర్ పీజేఆర్ స్టేడియంలో రంగారెడ్డి జిల్లా‌ మాస్టర్ అథ్లెట్ అసోసియేషన్ అధ్యక్షుడు‌ కొండా‌ విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి నూనె సురేందర్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అథ్లెట్ పోటీల్లో పాల్గొని జిల్లాకు పేరు తీసుకురావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ప్రతి మాస్టర్ ఆథ్లెట్ పోటీల్లో రాణించి మరిన్ని పతకాలను కైవసం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ పోటీల్లో బాగంగా రన్నింగ్, జంపింగ్, వాకింగ్, త్రో తదితర క్రీడల్లో పాల్గొని విజేతలుగా నిలిచి బంగారు, రజతం, వెండి పథాకాలను సాధించిన మానస పతి, స్వాతి, తను, జ్యోతి, మల్లేశ్వరి, సితిజ, సుల్తానా, సుష్మిత, సవిత, శారద, సందీప్, జితేంద్ర, బాలరాజు నూనె సురేంద్ర, ఏసురత్నం, ఆజయ్ లను కమిటీ సభ్యులు అభినందించి సన్మానించారు.

మాస్టర్ అథ్లెటిక్స్ లో‌ ప్రతిభ చాటిన క్రీడాకారులతో కొండా విజయ్

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here