ఆకట్టుకున్న రఘురామం భరత నాట్య ప్రదర్శన

నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో డిస్ట్రిక్ట్ హ్యాండ్లూమ్ ఎక్స్ పో, శ్రీ రామ నవమి పండగను పురస్కరించుకుని ఆధ్యాత్మికతతో కూడిన‌ సాంస్కృతిక ‌ప్రదర్శనలు నిర్వహించారు. శ్రీరామనవమి సందర్భంగా భావయామి రఘు రామం భరతనాట్య నృత్య ప్రదర్శన ఆకట్టుకున్నాయి. చిత్ర నారాయణ శిష్య బృందం కన్నులకట్టినట్టు శ్రీ రాముని మహత్యాన్ని తమ ప్రదర్శనలతో చూపించారు. తోడయా మంగళం, భావయామి వర్ణం, పలుకీ బంగారమాయేన, శ్రీ రామ చంద్ర కృపాలు, తిల్లాన అంశాలను ప్రదర్శించి మెప్పించారు. కళాకారులు శ్రీజ, మోక్ష, సుమేధ, సంజన, నిత్యశ్రీ, వర్షిణి, శ్రియ, అధ్య, వంశిక,వైష్ణవి, శ్రీదేవి తదితరులు ప్రదర్శించారు.

ఆధ్యంతం అలరించిన కళాకారుల సాంస్కృతిక ‌ప్రదర్శనలు

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here