ఖాజాగూడలో బతుకమ్మ చీరల పంపిణీ చేసిన కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: బతుకమ్మ పండగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులకు అందజేస్తున్న బతుకమ్మ చీరలను గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగూడ కమ్యూనిటీ హాల్ లో స్థానిక డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ పండగకు విశ్వ వ్యాప్తంగా విశిష్ట ఖ్యాతి లభించిందన్నారు. సంస్కృతీ సాంప్రదాయాలకు నిలువుటద్దంలా బతుకమ్మ పండగ నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ గౌడ్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ ఆర్ వెంకటేష్ ,తిరుపతి, గచ్చిబౌలి డివిజన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు చిలుకూరు మహేశ్వరి, గచ్చిబౌలి డివిజన్ బీజేవైఎం ప్రెసిడెంట్ శివ, సీనియర్ నాయకులు, అరుణ్ గౌడ్, శివ సింగ్, ఇందిరా, వరలక్ష్మి అంగడి బడి టీచర్ జ్యోతి, బాబులు సింగ్ , గోవర్ధన్, రవి కుమార్, ప్రశాంత్, చిన్న, శంఖేష్ సింగ్, జీహెచ్ఎంసీ సిబ్బంది నరేందర్, బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఖాజాగూడలో బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్న కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here