నమస్తే శేరిలింగంపల్లి: కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలీని బిజెపి రాష్ట్ర నాయకులు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ నంద కుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. రామోజీ ఫిలింసిటీలో జరిగిన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కుమార్తె వివాహం కోసం నగరానికి విచ్చేసిన మంత్రి రామేశ్వర్ తెలీ బంజారహిల్స్ లో బసచేశారు. ఈ క్రమంలో నందకుమార్ యాదవ్ తో పాటు శేరిలింగంపల్లి బిజెపి నాయకుడు అందెల కుమార్ యాదవ్ లు కేంద్రమంత్రి రామేశ్వర్ తెలీని ఘనంగ సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.