నమస్తే శేరిలింగంపల్లి: కాలనీల్లో కామన్ ఎమినిటీస్ ను పరిరక్షించుకుంటే అందరికీ ఉపయోగపడతాయని, ప్రజల ఆస్తులను ప్రజలే కాపాడుకోవాలని బిజెపి రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కర రెడ్డి పిలుపునిచ్చారు. వివేకానంద జయంతి సందర్భంగా చందానగర్ డివిజన్ పరిధిలోని గౌతమీ నగర్ మున్సిపల్ పార్కు స్థలంలో రెండు రోజుల పాటు నిర్వహించిన షటిల్ బ్యాడ్మింటన్ పోటీలను ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కసిరెడ్డి భాస్కర రెడ్డి మాట్లాడుతూ కాలనీలో షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు 15 జట్లుగా ఏర్పడి మంచి వాతావరణంలో ఆడుకోవడం శుభపరిణామమని అన్నారు. గౌతమీ నగర్ మున్సిపల్ పార్కు స్థలం కోసం 22 సంవత్సరాల పోరాటం ఈ రోజు క్రీడాకారులకు ఉపయోగపడిందని అన్నారు. కొందరు అధికారుల అవినీతి, సహకరించని ప్రజాప్రతినిధుల కారణంగా పార్కులు అన్యాక్రాంతం అవుతున్నాయని తెలిపారు. కాలనీ పార్కు కోసం పోరాటంలో కోర్టుల చుట్టూ తిరగడం జరుగుతుందని అన్నారు. పార్కులు ప్రజల ఆస్థి అని, వాటిని కాపాడుకోవడం ప్రజల బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు నూనె సురేందర్, కిరణ్, బాలాజీ, శివరామకృష్ణ, లక్ష్మణ్ లతో పాటు కాలనీవాసులు, మహిళలు, యువకులు చిన్నారులు పాల్గొన్నారు.