నమస్తే శేరిలింగంపల్లి: కాలనీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ లో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, ఏఈ సునీల్ తో కలిసి పర్యటించారు. కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న యూజీడీ పనులను పరిశీలించారు. అనంతరం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఎన్టీఆర్ నగర్ వాసులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్టీఆర్ నగర్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలు ఉండడంతో పాత డ్రైనేజీ పైప్ లైన్ బ్లాక్ అవడంతో నూతనంగా కొత్త పైపులైన్ పనులను చేపట్టడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో ఏఈ సునీల్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, సీనియర్ నాయకులు వేణు రెడ్డి , సుబ్రహ్మణ్యం, బాబు రావు, రాజు, సాయి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.