నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశత్వం ప్రదర్శిస్తూ పేదలను రోడ్డు పాలు చేస్తుందని బిజెపి రాష్ట్ర నాయకులు కసిరెడ్డి భాస్కర రెడ్డి వాపోయారు. గౌలిదొడ్డి బసవతారక్ నగర్ బాధితులను గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకొని 240 మంది పేదలు 30 సంవత్సరాల నుండి నివసిస్తున్న నివాసాలను నేలమట్టం చేయడం సరికాదని అన్నారు. పేదలకు అండగా నిలబడే స్థాయి ఉన్న స్థానిక ఎమ్మెల్యే పేదలకు అన్యాయం చేశాడన్నారు. చట్టవ్యతిరేకమైన ఈ చర్యను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లి, న్యాయం జరిగే వరకూ పోరాడుతామని, బాధితుల తరపున బిజెపి ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకుడు రవీంద్ర ప్రసాద్ దూబే, స్థానిక నాయకులు పాల్గొన్నారు.