శేరిలింగంపల్లి, నవంబర్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ మిత్ర హిల్స్ కాలనీలో నిర్వహించిన కార్తీకమాస వనభోజన మహోత్సవ కార్యక్రమంలో బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలలో హైదర్ నగర్ డివిజన్ బీజేపీ సీనియర్ నాయకుడు సీతారామరాజు, ఇతర బీజేపీ నాయకులతో కలిసి రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ వనభోజన మహోత్సవం అంటే కేవలం భోజనం మాత్రమే కాదు, అందరం కలిసి ఐక్యంగా ఉండటం అని అన్నారు. చిన్నవారికి మన సంస్కృతిని తెలియజేసే శుభ సందర్భమని, మన ప్రకృతిని సంరక్షించుకోవడం, వ్యర్థాలను పోయకుండా శుభ్రతను పాటించడం అని అన్నారు. ఈ కార్తీక వనభోజన మహోత్సవం మనందరికీ ఆరోగ్యం, సంతోషం, ఐక్యతను ప్రసాదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటునానని, ప్రతి ఏడాది స్నేహితులతో, బంధువులతో, ప్రకృతితో కలిసి జ్ఞాపకాల్లో నిలిచేలా ఇలాంటి వేడుకలను జరుపుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ రమేష్, దేశాయ్, సుబ్బారావు, వెంకట్, అరుణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.






