శేరిలింగంపల్లి, నవంబర్ 2 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని భవానిపురం కాలనీ అసోసియేషన్ వాసులు రహదారులపై చెత్త పడేస్తున్న వారికి భారీ ఎత్తున జరిమానా విధించారు. రోడ్డుపై చెత్త వేయడం శిక్షార్హమైన నేరమని అన్నారు. బీఎన్ఎస్ సెక్షన్ 292, ఐటీ యాక్ట్ సెక్షన్ 66, 70బి ప్రకారం రోడ్డుపై చెత్త వేస్తే జరిమానా విధించబడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరు తమ కాలనీలు, పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.






