శ్రీ భవాని శంకర స్వామికి ఘ‌నంగా కార్తీక పౌర్ణ‌మి పూజ‌లు

చందాన‌గర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కార్తీక పౌర్ణమి సందర్భంగా చందాన‌గ‌ర్‌లోని విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ భవాని శంకర స్వామి వారికి నమక చమక సహిత మహాన్యాస పూర్వక ఏకాదశ మహా రుద్రాభిషేకం నిర్వ‌హించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్తీక దీపాలు వెలిగించి భక్తిప్రవత్తులు చాటుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు సత్యసాయి ఆధ్వర్యంలో సామూహిక రమ సహిత శ్రీ వీరవెంకతసత్యనారాయణ స్వామి వారి వ్రతాలు నిర్వ‌హించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని వ్రతాలు ఆచరించారు. అనంత‌రం స్వామి వారి తీర్ధ ప్రసాదాల‌ను స్వీకరించారు. పౌర్ణమి సందర్భంగా దేవాలయంలో కొలువై ఉన్న శ్రీ భవాని మాతకు విశేష పంచామృత అభిషేకం, విశేష పుష్ప అలంకారం, సహస్రనామ అర్చన, కుంకుమార్చన నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా పూజ‌ల్లో భ‌క్తులు పాల్గొని తీర్ధ ప్రసాదాల‌ను స్వీక‌రించారు.

స్వామి వారికి అభిషేకం నిర్వ‌హిస్తున్న అర్చ‌కులు
భ‌వానీ అమ్మ‌వారికి అర్చ‌న చేస్తున్న పండితులు
వ్ర‌తాల్లో పాల్గొన్న భ‌క్తులు
స్వామివారు, అమ్మ‌వార్లను ద‌ర్శించుకుంటున్న భ‌క్తులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here