జీహెచ్ఎంసీ ఎన్నికల నేప‌థ్యంలో రేపు హైద‌రాబాద్‌లో సెలవు

హైద‌రాబాద్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో అన్ని ప్ర‌భుత్వ, ప్రైవేటు కార్యాల‌యాలు, విద్యా సంస్థలు, ఇత‌ర ప‌రిశ్ర‌మలు, కార్యాల‌యాల‌కు సెల‌వు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు జిల్లా క‌లెక్ట‌ర్‌, అద‌న‌పు జిల్లా ఎన్నిక‌ల అధికారిణి శ్వేతా మ‌హంతి సోమ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఎన్నిక‌ల నేప‌థ్యంలో సెల‌వు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ప్ర‌జ‌లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకునేందుకు గాను సెల‌వు ఇచ్చిన‌ట్లు తెలిపారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క‌రూ నిబంధ‌న‌ల‌ను పాటించాల‌ని లేదంటే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here