తెలంగాణ రాష్ట్రంలో కాపులు, మున్నూరు కాపులు ఐక్యంగా ముందుకు

శేరిలింగంపల్లి, ఫిబ్ర‌వ‌రి 24 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్రంలో కాపులు, మున్నూరు కాపులు ఐక్యంగా ముందుకు సాగి సమిష్టిగా తమ హక్కులు సాధించుకోవాలని నిర్ణయించారు. మియాపూర్ లోని సత్య భారతి కన్వెన్షన్ లో కాపు, మున్నూరు కాపు ప్రతినిధుల సమావేశం నిర్వ‌హించారు. రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం నిర్వ‌హించారు. మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొండా దేవయ్య పటేల్, రాష్ట్ర కాపు జేఏసీ ప్రధాన కార్యదర్శి రంగిశెట్టి మంగబాబు, మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కొత్త లక్ష్మణ్ పటేల్ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా 5000 కోట్ల రూపాయల నిధులతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, తెలంగాణ రాష్ట్రంలో కుల గణనలో మున్నూరు కాపు లకు జరిగిన అన్యాయంపై సమిష్టిగా పోరాటం చేయాలని నిర్ణయించి మార్చి చివరి వారంలో ఆత్మగౌరవ సభను హైదరాబాదులో నిర్వహించాలని, కాపులకు, మున్నూరు కాపులకు రాజకీయంగా గాని సామాజికంగా గాని ఏ విధమైన ఇబ్బంది జరిగిన సమైక్యంగా ఎదుర్కొనేందుకు ముందుకు వెళ్లాలని ఈ మూడు అంశాలపై సమావేశంలో తీర్మానించారు. దీనికోసం ఐక్యవేదికను ఒకటి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాజ్యసభ సభ్యుడు, మున్నూరుకాపు సంఘం తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వద్దిరాజు రవిచంద్ర, భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు కోవా లక్ష్మణ్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపుల పట్ల అధికార ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంబిస్తూ బీసీలను అందులో మున్నూరు కాపులను మరీ తక్కువ చూపించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో మున్నూరుకాపుల శక్తి నిరూపణకు సమయం అసనమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముత్యాల రామదాస్, లక్ష్మీకాంతం ఐఏఎస్ , టిఎస్పిఎస్సి విటల్ , తెలంగాణ విటల్ , మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బండి పద్మ, హైదరాబాద్ జిల్లా మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు మహేందర్ కుమార్ పటేల్, మున్నూరు కాపు సంఘం స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బాపట్ల మురళి, కోఆర్డినేటర్ దాదె వెంకట్, మున్నూరు కాపు నాయ‌కులు మీసాల చంద్రయ్య, అరవ రామకృష్ణ, మరికలపోతు సుధీర్, సమ్మెట ప్రసాద్, బండి పద్మ, ప్రసాద్, పెన్ టీం మెంటర్స్ డాక్టర్ పి ఎల్ ఎన్ పటేల్, బేటి శ్రీధర్, ఉద్యోగ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు బాలా శ్రీనివాస పటేల్, ఉద్యోగుల సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నేతిమంగమ్మ, పర్సా పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here