నమస్తే శేరిలింగంపల్లి: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి గంగారం గ్రామానికి చెందిన యువ నాయకుడు కంది సాయికుమార్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మిని మర్యాద పూర్వకంగా కలిశారు. మిత్రులతో కలసి ఆమెకు శుభకృతు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. పేరుకు తగ్గట్టుగానే శుభకృతు నామ సంవత్సరంలో గంగారం గ్రామ ప్రజలకు అంత శుభం జరుగుతుందని మేయర్ విజయలక్ష్మి ఆశాభావం వ్యక్తం చేశారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో కొప్పుల అరుణ్ కుమార్ శివ తదితరులు ఉన్నారు.
