నమస్తే శేరిలింగంపల్లి: శ్రీ శుభకృత్ నామ తెలుగు సంవత్సరాది వేడుకలు ధర్మపురి క్షేత్రంలో ఘనంగా జరిగాయి. ఆలయ వ్యవస్థాపకురాలు భారతీయం సత్యవాణి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పంచాంగ పఠనం భక్తులకు వినిపించారు. గట్టి కృష్ణమూర్తి శిష్య బృందం చిన్నారులు పద్య పఠనం, గద్య పఠనం చేశారు. సౌజన్య నృత్య ప్రదర్శన, మాధురి మధురిమ స్వాగతం గానం చేశారు. సంగీత రంగంలో బుద్ధ ధనుంజయ సాహిత్య రంగంలో వక్కంతం సూర్యనారాయణ రావు, ఆనంద సాయి స్వామి కి ఉగాది పురస్కారాలు ధర్మపురి క్షేత్రం తరఫున పెన్నార్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ పివి రావు, రచయిత డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ప్రధానం చేశారు. విధాత్రి ఫౌండేషన్ సౌజన్యంతో నిర్వహించిన ఉగాది వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.