నమస్తే శేరిలింగంపల్లి: పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలను పెంచి కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందని సీపీఎం రంగారెడ్డి జిల్లా కార్యవర్గసభ్యులు సి. శోభన్ అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ సీపీఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు చందానగర్ గాంధీ విగ్రహం ఎదుట సీపీఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శోభన్ మాట్లాడుతూ ఇంధన ధరలు 12 రోజుల్లో పది సార్లు పెరగడం దారుణమని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలను పెంచుతూ సామాన్య ప్రజలపై ఎనలేని భారం మోపుతున్నాయని ఆవేదన చెందారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలకు తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం శేరిలింగంపల్లి పార్టీ నాయకులు వి మాణిక్యం, కొంగరి కృష్ణ నాయుడు, సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ నాయకుడు అభిషేకనందన్, ఋతు ప్రియ, మోహిత్, నిఖిల్, ఆసీస్, మోహన్, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.