నమస్తే శేరిలింగంపల్లి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 131వ జయంతిని పురస్కరించుకొని మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన దళిత రత్న అవార్డును కంది జ్ఞానేశ్వర్ అందుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర స్థాయి ఉత్సవ కమిటీ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం దళిత రత్న అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని రవీంద్రభారతిలో నిర్వహించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దళితుల అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. దళిత సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించి సేవా కార్యక్రమాలు చేపట్టిన కంది జ్ఞానేశ్వర్ కు దళిత రత్న అవార్డును మంత్రి కొప్పుల ఈశ్వర్ అందజేసి శాలువాతో సత్కరించారు. అవార్డు అందుకున్న జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ ఈ అవార్డు ప్రధానోత్సవంతో భవిష్యత్తులో మరింత బాధ్యత పెరిగిందన్నారు. అవార్డుకు ఎంపిక చేసిన రాష్ట్ర స్థాయి కమిటీకి, మంత్రి ఈశ్వర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.