భవనంపై నుంచి దూకి మహిళా న్యాయవాది ఆత్మహత్య- భార్యభర్తల మధ్య నెలకొన్న కలహాలే కారణం- పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన భర్త

నమస్తే శేరిలింగంపల్లి: భార్యభర్తల మధ్య నెలకొన్న‌ వివాదాలతో ఓ మహిళా న్యాయవాది భవనంపై దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. శేరిలింగంపల్లి నల్లగండ్లలోని లక్ష్మీ విహార్ ఫేజ్ వన్ డిఫెన్స్ కాలనీలో మహిళా న్యాయవాది శివానీ‌ కి అర్జున్ తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. భర్త అర్జున్ తో తరచూ గొడవ పడడం ఇటీవలి కాలంలో వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మనస్థాపానికి‌ గురైన భార్య శివానీ డిఫెన్స్ కాలనీలో నివాసం ఉంటున్న వారి భవనంపై‌ నుంచి శనివారం రాత్రి శివానీ దూకి ఆత్మహత్య చేసుకుంది. భర్త అర్జున్ చందానగర్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోవడంతో అరెస్టు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఆత్మహత్య చేసుకున్న మహిళా న్యాయవాది శివానీ (ఫైల్ ఫోటో)
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here