ఘ‌నంగా క‌న‌క‌మామిడి న‌రెంద‌ర్ గౌడ్ జ‌న్మ‌దిన వేడుక‌లు – హ‌ఫీజ్‌పేట్ ప్ర‌భుత్వ పాఠ‌శాల విద్యార్థుల‌కు బోద‌న సామాగ్రి పంపిణి

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: హఫీజ్‌పేట్ డివిజ‌న్ సీనియ‌ర్ నాయ‌కులు, ప్ర‌ముఖ సంఘ సేవ‌కులు క‌న‌క‌మామిడి న‌రెంద‌ర్ గౌడ్ జ‌న్మ‌దిన వేడుకలు శ‌నివారం ఘ‌నంగా జ‌రిగాయి. మాదాపూర్ కార్పొరేట‌ర్ వి.జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌, బిజెపి రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యులు జ్ఞానేంద్ర ప్ర‌సాద్ త‌దిత‌రులు న‌రెంద‌ర్ గౌడ్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ క్ర‌మంలోనే హ‌ఫీజ్‌పేట్ ప్ర‌భుత్వ పాఠ‌శాల చిన్నారుల‌కు నోట్‌బుక్స్‌, పెన్నులు, బిస్కెట్ ప్కాకెట్‌ల‌ను అంద‌జేశారు. అదేవిధంగా పాఠ‌శాల ప్రాంగ‌ణంలో మొక్క‌లు నాటారు. ఈ సంద‌ర్భంగా న‌రెంద‌ర్ గౌడ్ మాట్లాడుతూ ప్ర‌భుత్వ పాఠ‌శాల చిన్నారుల న‌డుమ త‌న పుట్టిన‌రోజు జ‌రుపుకోవ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో నాయ‌కులు యాదగిరిగౌడ్, మాణె వెంకటేష్‌, రాధాకృష్ణ, పాండు ముదిరాజ్‌, జగన్ గౌడ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

హ‌ఫ‌జ్‌పేట్ ప్ర‌భుత్వ పాఠ‌శాల విద్యార్థుల‌కు బోద‌న సామాగ్రిని పంపిణీ చేస్తున్న న‌రెంద‌ర్ గౌడ్‌, జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ త‌దిత‌రులు
పాఠ‌శాల ప్రాంగ‌ణంలో మొక్క‌లు నాటుతున్న న‌రెంద‌ర్ గౌడ్‌, జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌, జ్ఞానేంద్ర ప్రసాద్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here