దీన్ దయాళ్ ఉపాధ్యాయ సేవలు మరవలేం: బీజేపీ రాష్ట్ర‌ నాయకులు రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ కార్యాలయంలో శనివారం పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి ఉత్సవాన్ని నిర్వహించారు. బిజెపి రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పాల్గొని దీన్ దయాళ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుల్లో ఒకరిగా, ప్రధాన కార్యదర్శిగా దీన్ దయాళ్ పనిచేశారన్నారు. జనసంఘ్ వ్యవస్థాపకులలో ఒకరిగా భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతాన్ని “ఏకత్మతా మానవత వాదం” ప్రవచించిన వ్యక్తిగా ప్రపంచానికి తెలిసిన వ్యక్తి అని, ఆ మహనీయుని జయంతి సందర్భంగా స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ జనసంఘ్‌కు సిద్ధాంతాలు లేవన్నవారి నోర్లు మూయించడానికి ఏకాత్మతా మానవతా వాదం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి దీన్ దయాళ్ అన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అర్బన్ కార్యదర్శి వరలక్ష్మి ధీరజ్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, గోపనపల్లి తండా వడ్డెర సంఘం ప్రెసిడెంట్ అలకుంట శ్రీరామ్, సీనియర్ నాయకులు నర్సింగ్ నాయక్, శివ సింగ్, హరీష్ శంకర్ యాదవ్, కిషన్ గౌలి, మన్నే రమేష్, వెంకటేష్, నర్సింగ్ రావు , శ్రీను, శంఖేష్ సింగ్, నరేష్, రాజు, హఫీజ్, యాదయ్య, కార్యకర్తలు, భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

దీన్ దయాళ్ జయంతి కార్యక్రమం లో రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here