- కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ లబ్దిదారులు 92 మందికి చెక్కుల పంపిణీ
నమస్తే శేరిలింగంపల్లి: కరోనా కష్టకాలంలోనూ తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని మరవడం లేదని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా రూ.1,00,116 చొప్పున 92 మందికి మంజూరైన ఆర్థిక సహాయం చెక్కులను శనివారం గాంధీ లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకవైపు కరోనా ఉదృతి కొనసాగుతున్నప్పటికి సంక్షేమం విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీ పడటం లేడని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయనిది తదితర చెక్కుల పంపిణీ నిరాటంకంగా కొనసాగుతుందని అన్నారు. ఈ క్రమంలో నియోజకవర్గం ప్రజల తరపున ముఖ్యమంత్రికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మాదవరం రోజాదేవి రంగారావు, దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
