కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వ‌ర్గాల‌కు న్యాయం: జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంప‌ల్లి, మార్చి 20 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాలకు న్యాయం జ‌రుగుతుంద‌ని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, గ్రేటర్ హైదరాబాద్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధికి ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో జీహెచ్‌ఎంసీకి రూ.3,101.21 కోట్లు నిధులు కేటాయించ‌డంపై ఆయ‌న హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల స‌మ‌క్షంలో పెద్ద ఎత్తున సంబ‌రాలు జ‌రుపుకున్నారు. అనంత‌రం జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ మాట్లాడుతూ బీసీ/ఎస్సీ/మైనారిటీలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా లబ్ది జ‌రుగుతుంద‌న్నారు.

ఎస్సీ వర్గీకరణ, బీసీ బిల్లు శాసనసభలో ఆమోదం పొంద‌డం చాలా సంతోషక‌ర‌మైన విష‌య‌మన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సంద‌ర్భంగా హాఫీజ్ పెట్ వార్డ్ కార్యాలయంలో కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, మంత్రులు భ‌ట్టి విక్రమార్క, దుద్దిళ్ల‌ శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, గడ్డం ప్రసాద్, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చిత్రపటాల‌కి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు బాలింగ్ యాదగిరి గౌడ్, పూజారి, కనకమామిడి నరేందర్ గౌడ్, సయ్యద్ సత్తార్ హుస్సేన్, సుదర్శన్, సయ్యద్ తహెర్ హుస్సేన్, జమీర్, శేరిలింగంపల్లి ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్, రవి, జంగయ్య, బాజి, జోసెఫ్‌, రవి, సంజు, కమోజీ, కనకారెడ్డి, జలీల్, సురేందర్ గౌడ్, కె.వెంకటేష్, మల్లేష్, పాషా, మౌలానా, దాసు, శంకర్, యూనిస్, ప్రభు గౌడ్, ప్రవీణ్, వెంకటేష్ ముదిరాజ్, దిలీప్, తిరుపతయ్య, ముజీబ్, నవీన్ యాదవ్, యాదగిరి, మహిళలు శిరీష, శ్రావణి, ఆశ, నవమి, అమరావతి, రామలక్ష్మక్, మహాలక్ష్మి, రమాదేవి, అన్నపూర్ణ, చంద్రకళ, పర్వీన్, కృష్ణ వేణి, రేణుక, రాధ, పుష్పాలత, పల్లవి, రాములమ్మ, బుజమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here