శేరిలింగంపల్లి, అక్టోబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని చందానగర్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో డీసీ డి.శశిరేఖ, ACP నాగిరెడ్డి, AMOH Dr. K. S. రవి, Engineering section శ్రీదేవి, Entomology section R.చిన్నా, UBD section సమీర, Electrical section లక్ష్మి ప్రియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు పలు విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బందికి తమ ఫిర్యాదులను అందజేశారు. టౌన్‌ప్లానింగ్ విభాగంలో 7 ఫిర్యాదులు రాగా, ఇంజినీరింగ్ విభాగంలో 3, రెవెన్యూ 5, ఎలక్ట్రికల్ 1, యూబీడీ 2, ఏఎంవోహెచ్ విభాగంలో 2 మొత్తం 20 ఫిర్యాదులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా డీసీ శశిరేఖ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులు, సిబ్బందికి ఆదేశించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.






