జ‌న శిక్ష‌ణ సంస్థాన్ రంగారెడ్డి జిల్లా బోర్డు మెంబ‌ర్‌గా గుండ్ర రోజి

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: జ‌న శిక్ష‌ణ సంస్థాన్ రంగారెడ్డి జిల్లా బోర్డు మెంబ‌ర్‌గా శేరిలింగంప‌ల్లికి చెందిన‌ సంకల్ఫ్ ఫౌండేష‌న్ వ్య‌వ‌స్థాప‌కురాలు గుండ్ర రోజి నియ‌మితుల‌య్యారు. సామాజిక సేవా విభాగం నుంచి రోజీకి ఈ స్థానం ద‌క్కింది. ఈ సంద‌ర్భంగా రోజీ మాట్లాడుతూ త‌న‌పై న‌మ్మ‌క‌ముంచి భాద్య‌త‌లు అప్ప‌గించిన ఉన్న‌తాధికారుల‌కు ఆమె ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. కేంద్ర ప్ర‌భుత్వంలోని స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆండ్ ఎంట‌ర్‌ప్రెన్యూర్ షిప్ మంత్రిత్వ శాఖా ప‌రిధిలో జ‌న శిక్ష‌ణ సంస్థాన్ ప‌నిచేస్తుంద‌ని తెలిపారు. ఈ బోర్డుకు హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్స‌టీ వీసీ జిల్లా చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రిస్తార‌ని తెలిపారు. యువ‌త‌లో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించేలా జ‌న శిక్ష‌ణ సంస్థ‌న్ ప‌నిచేస్తుంద‌ని అన్నారు. త‌న‌పై ఉంచిన న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌కుండా త‌న శ‌క్తిమేర కృషి చేస్తాన‌ని తెలిపారు.

జ‌న శిక్ష‌ణ సంస్థాన్ రంగారెడ్డి జిల్లా బోర్డు మెంబ‌ర్‌, సంకల్ప్ ఫౌండేష‌న్ వ్య‌వ‌స్థాప‌కురాలు గుండ్ర రోజి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here