మియాపూర్ స‌.నెం.28లోని ప్ర‌భుత్వ భూమిని క‌బ్జా నుండి కాపాడండి… జిల్లా క‌లెక్ట‌ర్‌కు ఏఐఎఫ్‌డీఎస్ ఫిర్యాదు…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: మియాపూర్ స‌ర్వేనెంబ‌ర్ 28లోని ప్ర‌భుత్వ భూమిని క‌బ్జా నుండి కాపాడాల‌ని కోరుతూ ఏఐఎఫ్‌డీఎస్ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లె ముర‌ళి రంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్ అమోయ్‌కుమార్‌కు ఫిర్యాదు ప‌త్రం స‌మ‌ర్పించారు. మియాపూర్ ల‌క్ష్మీన‌గ‌ర్ కాల‌నీని ఆనుకుని మియాపూర్ గ్రామ‌ స‌ర్వేనెంబ‌ర్ 28లో ఉన్న ప్ర‌భుత్వ భూమిలో దాదాపు 2 వేల గ‌జాల స్థ‌లాన్ని ఆక్ర‌మించే ప్ర‌య‌త్నం జ‌రుగుతున్న‌ద‌ని తెలిపారు. ఇప్ప‌టికే స‌ద‌రు రియ‌ల్ట‌ర్లు స్థలం చుట్టు రేకుల‌ను ఏర్పాటు చేశార‌ని అన్నారు. గ‌తంలోను ఇదే మాదిరిగా 700 గ‌జాల స్థ‌లాన్ని క‌బ్జా చేసి అబాడ్ ట్రెండ్స్ పేరుతో ఐదంత‌స్థుల నిర్మాణం చేప‌ట్టి కోట్లు గ‌డించార‌ని అన్నారు. భ‌వ‌న నిర్మాణ ద‌శ‌లో అధికారుల‌కు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ప‌ట్టించుకోలేర‌ని, తాజాగా కొన‌సాగుతున్న అక్ర‌మాన్ని ప్రాథ‌మిక ద‌శ‌లోనే అడ్డుకుని ప్ర‌భుత్వ భూమిని కాపాడాల‌ని లేఖ‌లో పేర్కొన్నారు.

మియాపూర్ స‌.నెం.28లో ఆక్ర‌మ‌ణ‌కు గుర‌వ‌తున్న‌ట్టు ప‌ల్లె ముర‌ళి ఫిర్యాదులో పేర్కొన్న స్థ‌లం ఇదే
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here