జై భారతమాత సేవా సమితి ఆధ్వర్యంలో ఆల్విన్ కాల‌నీ నిరుపేద‌ల‌కు నిత్యావ‌స‌రాల పంపిణీ

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: ఆల్విన్ కాలనీ డివిజన్ ప‌రిధిలోని భాగ్యనగర్ కాలనీలో జై భారతమాత సేవా సమితి ఆద్వ‌ర్యంలో క‌రోనాతో ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు గురువారం నిత్యావ‌స‌రాల‌ను అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా స‌మితి రాష్ట్ర అధ్య‌క్షులు ల‌గ్దే నాగ‌రాజు మాట్లాడుతూ క‌రోనా క‌ష్ట‌కాలంలో ఆక‌లితో అల‌మ‌టిస్తున్న నిరుపేద‌లకు జై భార‌త్‌మాత సేమా స‌మితి త‌ర‌పున తోచిన స‌హ‌కారం అందిస్తున్న‌ట్టు తెలిపారు. ఈ క్ర‌మంలోనే ఆల్విన్‌కాల‌నీలో 150 కుటుంబాల‌కు 25 కిలోల బియ్యంతో పాటు 7 ర‌కాల నిత్యావ‌స‌రాల‌ను పంపిణీ చేసిన‌ట్టు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో స‌మితి జనరల్ సెక్రెటరీ ఎర్రవల్లి ప్రభాకర్, జాయింట్ సెక్రెటరీ మనోళ్ల విట్టల్, ట్రెజరర్ జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.

ఆల్విన్ కాల‌నీ వాసుల‌కు నిత్యావ‌స‌రాల‌ను పంపిణీ చేస్తున్న జై భార‌త్‌మాత సేవా స‌మితి అధ్య‌క్షుడు ల‌గ్ధే నాగ‌రాజు త‌దిత‌రులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here