శేరిలింగంపల్లి, జూన్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ , టీపీసీసీ ప్రధాన కారదర్శి జగదీశ్వర్ గౌడ్ జన్మదినం సందర్భంగా పార్టీ హఫీజ్‌పేట్ డివిజన్ ఇంచార్జ్ కనకమామిడి నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో హఫీజ్‌పేట్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాలు, స్టేషనరీ పంపిణీ చేశారు. అనంతరం మదీనాగూడలోని శ్రీ వివేకానంద సేవ సంగమ్ వృద్ధాశ్రమంలో వృద్ధులకి భోజనం, పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలింగ్ యాదగిరి గౌడ్, నల్లా సంజీవ్ రెడ్డి, వివేక్ గౌడ్, రోహిత్, అభిషేక్, సుదర్శన్, సంజీవ్, మహేష్, దేవేందర్, ముజీబ్, శ్రీనివాస్ రాజు, బాబు పాల్గొన్నారు.