నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఇజ్జత్ నగర్, కాకతీయ హిల్స్ లో ఏర్పాటు చేసిన వినాయకుని మండపాలలో స్థానిక కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ నాయకులు రాజు ముదిరాజ్, ఓ.కృష్ణ, గంగుల గణేష్ యాదవ్, ఓ.బలరామ్, శ్యామ్, కృష్ణ గౌడ్, బలేష్, రాంచందర్, లోకేష్, మహిందర్, ప్రసాద్, సత్తి రెడ్డి, ఆశిల శ్యామ్, సురేందర్, రవి తదితరులు పాల్గొన్నారు.