నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ లోని ప్రతి కాలనీలో మెరుగైన మౌళిక వసతులు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి. జగదీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. శనివారం మాదాపూర్ డివిజన్ పరిధిలోని కావూరి హిల్స్ లో స్థానికులతో కలిసి పర్యటించారు. కాలనీలో నెలకొన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యను పరిశీలించారు. డివిజన్ పరిధిలో మంజూరైన అభివృధి పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కే.వి రావు, రామిరెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.
