నమస్తే శేరిలింగంపల్లి: జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు బిజెపి రంగారెడ్డి జిల్లా కార్యవర్గం శుక్రవారం నిరసన దర్న చేపట్టింది. జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్ల మరమ్మతులు చేపట్టాలని, అదేవిధంగా నాలాలను నాలాలలో అక్రమంగా వెలసిన నిర్మాణాలను తొలగించి వరద ముంపును కట్టడి చేయాలనే డిమాండ్‌తో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి అధ్యక్షతన బిజెపి నేతలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సామ రంగారెడ్డి మాట్లాడుతూ ఒకవైపు వర్షాలు మొదలవ్వగా మరోవైపు నగరంలో నాలాల పూడికతీత పనులు పూర్తవ్వని పరిస్థితి నెలకొందని అన్నారు. అదేవిధంగా ఎక్కడ చూసిన రోడ్లు దెబ్బతిని వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వరద ముంపు నుంచి నగరాన్ని కాపాడాలని, రోడ్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జ్ఞానేంద్ర ప్రసాద్, జిల్లా ప్రధానకార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్, ఉపాధ్యక్షుడు బుచ్చిరెడ్డి, కార్యదర్శి మూల అనిల్‌గౌడ్, అధికార ప్రతినిధి మారం వెంకట్, నాయకులు మహిపాల్ రెడ్డి, స్వామిగౌడ్, ప్రసాద్, శ్రీనివాస్ చారీ, శివ తదితరులు పాల్గొన్నారు.