సీఆర్పీఎఫ్ సిబ్బంది అరాచకాలను ఆపి‌ న్యాయం చేయండి – బీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో ఆయా కాలనీ వాసుల వినతి

నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి రెవెన్యూ పరిధి మియాపూర్ గ్రామంలో నడిగడ్డ తాండ, సుభాష్ చంద్ర నగర్, ఓంకార్ నగర్ లలో గత కొన్ని దశాబ్దాలుగా నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న పేదలను సీఆర్పీఎఫ్ బెటాలియన్ ఇబ్బందులకు‌ గురిచేయడం సరికాదని బహుజన‌ లెప్ట్ ఫ్రంట్ నాయకులు వాపోయారు. సీఆర్పీఎఫ్ సమస్యను పరిష్కరించాలని బీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో ఆయా కాలనీ వాసులు రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ ‌కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కూలిపోయిన ఇండ్లను పునర్ నిర్మాణం కోసం కావల్సిన సామాగ్రి తెచ్చి నిర్మాణం చేస్తుంటే సీఆర్పీఎఫ్ బెటాలియన్ సిబ్బంది నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడం, నిర్మాణ సామాగ్రి లోపలికి రాకుండా అడ్డుకోవడం జరుగుతుందన్నారు. బస్తీలలో పేద ప్రజలపై దాడి చేసి మహిళల పట్ల మానవత్వాన్ని మరిచి దురుసుగా ప్రవర్తించారన్నారు. సుభాష్ చంద్ర బోస్ నగర్, ఓంకార్ నగర్ లో మరుగుదొడ్లు శిధిలావస్థలో ఉన్న ఇండ్ల పునర్నిర్మాణం చేయకుండా సీఆర్పీఎఫ్ అడ్డుకుంటుందని వాపోయారు. సీఆర్పీఎఫ్ సిబ్బంది అరాచకాలను అరికట్టి నడిగడ్డ తాండ ముందు వేసిన చెక్ పోస్ట్ ను తొలగించి సుభాష్ చంద్ర బోస్ నగర్ ఓంకార్ నగర్ లో ఇళ్లను నిర్మించుకునేలా సీఆర్పీఎఫ్ సిబ్బందికి, ఇతర శాఖల అధికారుల నుంచి ఎలాంటి ఆటంకాలు లేకుండా తగిన ఆదేశాలు ఇవ్వాలని కలెక్టర్ కు కాలనీల వాసులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ నాయకులు మైదంశెట్టి రమేష్, పల్లె మురళి, ఇస్లావత్ దశరథ్ నాయక్, డి. రంగస్వామి, ఎం రాములు నాయక్, నాయిని రత్న కుమార్, విమల, బాలస్వామి, నర్సింహా, లలిత, లక్ష్మి, గుడిసె శ్రీను, బాలస్వామి, హుస్సేన్, పర్శరాములు, అరుణ తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ ‌కలెక్టర్ కు వినతి పత్రం‌ ఇస్తున్న బీఎల్ఎఫ్ నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here