శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 15 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ డివిజన్ నడిగడ్డ తండాలో సేవాలాల్ మహారాజ్ తీర్ పండుగను పుర్కరించుకుని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, కూకట్‌పల్లి ఎంఎల్ఏ మాధవరం కృష్ణ రావుని సేవాలాల్ జయంతి కార్యక్రమానికి రావాలని ఆహ్వాన పత్రికను నడ్డిగడ్డ తండా వాసులతో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం BRS సీనియర్ నాయకుడు గోపరాజు శ్రీనివాస్ రావు , తండా వాసులు పాల్గొన్నారు.