శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 15 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ విలేజ్ లో రూ. 17.00 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలసి జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యుడు, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అర్థరాత్రి ఆకస్మికంగా వెళ్లి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ మియాపూర్ విలేజ్ లో 17.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలసి అర్థరాత్రి ఆకస్మికంగా వెళ్లి అక్కడే ఉండి స్వయంగా సిసి రోడ్డు నిర్మాణ నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు. మియాపూర్ విలేజ్ లో మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామని , సీసీ రోడ్ల వంటి అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని , నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, ప్రజలకు ట్రాఫిక్ రహిత , సుఖవంతమైన, మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం అధికారులు డిఈ దుర్గాప్రసాద్, ఏఈ సంతోష్, వర్క్ ఇన్స్పెక్టర్ నవీన్, స్థానిక నాయకులు మహేందర్ ముదిరాజ్, శ్రీనివాస్ ముదిరాజ్, చిరంజీవి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.