శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 15 (నమస్తే శేరిలింగంపల్లి): ఫిబ్రవరి 14, 2019 న జమ్మూకాశ్మీర్ లోని పుల్వామాలో ఇండియన్ ఆర్మీ కాన్వాయ్ పై ముష్కరులు దాడి జరిగి 40 మంది ఆర్మీ జవానులు మృతి చెంది ఆరేళ్లు అవుతుండగా ఈ ఘటనలో మరణించిన ఆర్మీ సిబ్బందికి ఘన నివాళులు అర్పించారు. ఆయువు స్టూడెంట్స్ యూత్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జి.రోహిత్ ముదిరాజ్, ఉపాధ్యక్షుడు చరణ్, ప్రధాన కార్యదర్శి టి.రాజేష్, కోశాధికారి భాను ముదిరాజ్, సభ్యులు చందు, సంతూ, అఖిల్, బాల కృష్ణ, గౌరీ, వసంత్, మురళి, లక్ష్మణ్, వినయ్, కలీం, చందు, చరణ్ గౌడ్, కిరణ్ గౌడ్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.