శేరిలింగంపల్లి, మార్చి 8 (నమస్తే శేరిలింగంపల్లి): అంతర్జాతీయ మహిళ దినోత్సవంను పురస్కరించుకుని చందానగర్ డివిజన్ పరిధిలోని రెడ్డి కాలనీ లో కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆమె నివాసంలో నిర్వహించిన మహిళ దినోత్సవ వేడుకలలో కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని మహిళలను సన్మానించి, వారికి చీరలను అందచేసి, కేక్ కట్ చేసి అంతర్జాతీయ మహిళ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రఘునాథ్ రెడ్డి, నాగరాజు, ఓ .వెంకటేష్, ఎల్లమయ్య, భవాని, నరేందర్ బల్లా, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.