శేరిలింగంపల్లి, మార్చి 8 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా 44 మంది లబ్ధిదారులకు (CMRF) ద్వారా మంజూరైన 19,15,500 ఆర్థిక సహాయానికి సంబంధించిన CMRF చెక్కులను కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ బాధిత కుటుంబాలకి అందచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, నాయకులు రఘునాథ్ రెడ్డి, ఆదర్శ్ రెడ్డి, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ , నాయినేనీ చంద్రకాంత్ రావు, సాంబశివరావు, గురు చరణ్ దుబే, పోతుల రాజేందర్, కాశినాథ్ యాదవ్, MD ఇబ్రహీం, చంద్రిక ప్రసాద్, చంద్రమోహన్ సాగర్, మోజేశ్ , రాము, శివ సాగర్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.