న్యూ గుడ్ షెఫ‌ర్డ్ హైస్కూల్ లో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం

శేరిలింగంపల్లి, సెప్టెంబ‌ర్ 8 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): చందానగర్ పరిధిలోని న్యూ గుడ్ షెఫ‌ర్డ్ హైస్కూల్ లో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన‌ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ విద్యార్థిని విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ (నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు, షార్ప్ నర్లు, ఎరేజర్లు), పండ్లు, బిస్కెట్లు అందజేశారు. ఈ సందర్భంగా రామస్వామి యాదవ్ మాట్లాడుతూ మానవుని సర్వతోముఖాభివృద్ధి కేవలం విద్య తోనే సాధ్యమ‌ని అన్నారు. ప్రపంచంలో చాలా దేశాల వెనుకబాటు తనానికి కారణం నిరక్షరాస్యత అని భావించి UNESCO అక్షరాస్యత దినోత్సవాన్ని ప్రపంచమంతటా ఒక ప్రత్యేకమైన నినాదంతో నిర్వహిస్తుంద‌ని తెలిపారు. ఈ సంవత్సరపు నినాదం డిజిటల్ యుగంలో అక్షరాస్యతను ప్రోత్సహించడమ‌ని, దీని ప్రధాన ఉద్దేశ్యం విద్య ప్రాథమిక హక్కుగా, వ్యక్తిగత, సామాజిక అభివృద్ధిలో కీలక భాగమే అని తెలియజేయడం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మెర్సి, అధ్యాపకులు శోభ, అంజలి, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శివరామకృష్ణ, అమ్మయ్య చౌదరి, పాలం శ్రీను, విష్ణు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here