అర్హులైన అంద‌రికీ ఇందిర‌మ్మ ఇళ్లు: జగదీశ్వర్ గౌడ్

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 21 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క అడుగు ముందుకు వేస్తుంద‌ని, అర్హు లైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు అందిస్తుంద‌ని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ ప్రజలందరూ ఇందిరమ్మ సభలను వినియోగించుకోవాలని, వార్డు సభల్లో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు భాగస్వామ్యమై అర్హులకు సం క్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇందిరమ్మ సభ కార్యక్రమంలో భాగంగా మాదాపూర్ వార్డ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులతో కలిసి ఆయ‌న పాల్గొన్నారు.

మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు జరిగే వార్డు సభల్లో అర్హులైన ప్రతి ఒక్క రికి రేషన్‌కార్డు, ఇందిరమ్మ ఇళ్లు, రైతుభరోసా తదితర పథకాలు అందేలా ప్రతిఒక్కరు కృషి చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ పట్టణ గ్రామ సభలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి వార్డ్ కార్యాలయంలో నేటి నుంచి 26వ తేదీ వరకు నిర్వహించే సభలను వినియోగించుకొని రేషన్ కార్డుల, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవాలని సూచించారు. అర్హు లైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు అందిస్తుందని, ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు చేయని వారు గ్రామాల్లో 21 నుంచి 24 వరకు నిర్వహించే గ్రామసభలో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. 75 గజాల స్థలం ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం నాలుగు విడతలుగా రూ.5 లక్షలు ఇస్తుందన్నారు.

కార్య‌క్ర‌మంలో మాట్లాడుతున్న జగదీశ్వర్ గౌడ్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేషన్ కార్డుల జారీపై కీలక ప్రకటన చేశారని, జాబితాలో పేరు రానివారు ఆందోళన చెందవద్దని నేటి నుంచి నిర్వ‌హించే ఇందిరమ్మ సభల్లో అర్హులైన వారు దరఖాస్తు చేసుకోగలరు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు నగేష్ నాయక్, నాయకులు నాగేశ్వరరావు, కోటేశ్వరరావు, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ముష్రాఫ్, రెహ్మాన్, రాజు, కిట్టు, నరేష్, ప్రభు, మొయిన్, శ్రీనివాస్ గౌడ్, అంజద్, ఖాజా, ముక్తార్, మాణిక్య‌ప్ప, రాజేష్, శంకర్, శ‌శిరేఖ, అనిత, లక్ష్మీ, శ్రీజ రెడ్డి, ప్రేమ, సర్దార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here