వరి ధాన్యం కేంద్రం కొనుగోలు చేయాలి: ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నందుకు నిరసనగా ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు మంత్రి, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ పిలుపు మేరకు ఇందిరా పార్కు వద్ద తలపెట్టిన రైతు మహా ధర్నాలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి కార్పొరేటర్లు, నాయకులు , కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొన్నారు. రైతు మహా ధర్నా కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర రైతులకు సంఘీభావం తెలుపుతూ నిర్వహించిన ధర్నాలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్ లు, మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ దేశచరిత్ర లో రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని, బీడు భూముల నుండి బంగారు సిరులు పండించే దిశగా తీర్చిదిద్దిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని, కాళేశ్వరం ప్రాజెక్టు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేశామన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడిక తీత ద్వారా నీటి సంవృద్ధిని సాధించామని, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల పాటు నిరంతరాయంగా నాణ్యమైన ఉచిత కరెంట్ అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనాలి అని, కేంద్రం కొనకుండా, రాష్ట్రం కొనే అవకాశం లేకుండా రైతు చట్టాలతో చేతులు కట్టేసిందని, దేశానికి అన్నం పెట్టే రైతన్నను వ్యతిరేఖ వ్యవసాయ చట్టాల పేరుతో రోడ్లపై ఆందోళనల్లో కూర్చోబెట్టింది అని, రైతులు కష్టపడి పండించిన వరి పంటను కేంద్రం కొనే వరకు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్ధృతంగా ఆందోళనలు చేస్తామని అన్నారు. కేంద్రం చేస్తున్న ఈ గందరగోళాన్ని తొలగించి ప్రజలకు, రైతులకు నిజాల్ని స్పష్టంగా తెలియజేయాలనే ఈ రైతు ధర్నాలు నిర్వహిస్తున్నామన్నారు. రాజ్యాంగం, వ్యవసాయ చట్టాల్ని అనుసరించి, పంటల్ని కొనుగోలు చేసే బాధ్యతను కేంద్రానికే ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు హమీద్ పటేల్, రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, రోజా రంగరావు, మంజుల రఘునాథ్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయి బాబా, మాజీ కార్పొరేటర్ రంగారావు, మాజీ కౌన్సిలర్లు మోహన్ గౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి, రాజు యాదవ్, రఘునాథ్ రెడ్డి, గౌతమ్ గౌడ్, రాజు నాయక్, సమ్మారెడ్డి, కృష్ణ గౌడ్, లక్ష్మీ నారాయణ, తెరాస నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇందిరాపార్కు వద్ద తలపెట్టిన రైతు ధర్నాలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here