నమస్తే శేరిలింగంపల్లి: తెలుగుజాతి ఇలవేల్పు, మరణం లేని జననం, విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, నటరత్న, పద్మ శ్రీ డా. శ్రీ నందమూరి తారక రామారావు అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ సమీపంలోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రులు మాల్లారెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామ నాగేశ్వరరావు మాజీ మంత్రి మోతుకుపల్లి నర్సిములు, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్, తాత మధు, ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్ రావు, ప్రకాష్ గౌడ్ గారు, మాగంటి గోపీనాథ్, వివేకానంద గౌడ్, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేష్, కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పుష్పగుచ్చం సమర్పించి నివాళి అర్పించారు.
ఈ సందర్బంగా విప్ గాంధీ మాట్లాడుతూ తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడని, సూర్య చంద్రులు ఉన్నంత వరకు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించిన మాహానుభావుడు, విశ్వవిఖ్యాత ఎన్టీఆర్ అన్నారు. ఎంతో మందికి ఆయన స్ఫూర్తి ప్రదాతగా నిలిచాడన్నారు. రాజకీయాలకు నూతన నిర్వచనం ఇచ్చి కోట్లాది జీవితాలలో వెలుగు నింపిన మహనీయుడని, పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారాన్ని కైవసం చేసుకొని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయం గా ముందుకు వెళ్లారని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు, యువత కు రాజకీయ అవకాశాలు కల్పించి కొత్త అధ్యాయానికి తెర లేపిన మహోన్నతుడు ఎన్టీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు ,అశోక్ గౌడ్, రవి ముదిరాజ్, గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షులు సంజీవ రెడ్డి, చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, నాయకులు ఉరిటీ వెంకట్రావు, బ్రిక్ శ్రీను, అక్తర్, మాధవరం గోపాల్, కాశినాథ్ యాదవ్, చంద్రమోహన్ సాగర్, శ్రీనివాస్, వెంకటేష్, మల్లేష్, గురుచరణ్ దూబే, నరేందర్ బల్లాల, నరేష్, తదితరులు పాల్గొన్నారు.