శేరిలింగంపల్లి నియోజకవర్గం లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

నమస్తే శేరిలింగంపల్లి: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. వాడవాడన మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు విద్యార్థులు, చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలతో ఆనందోత్సవాల మధ్యన నిర్వహించారు.

మదీనగూడలోని గౌతమీ విద్యాక్షేత్ర పాఠశాలలో పాఠశాల డైరెక్టర్ శ్వేతా రెడ్డి విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. చిన్నారులు ఉత్సాహంగా పిరమిడ్ ప్రదర్శన, మార్చ్ ఫాస్ట్, నృత్య గీతాలతో దేశభక్తిని చాటుకున్నారు. గౌతమి విద్యార్థులు ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగస్వాములై వేడుకలను నిర్వహించారు.

మదీనా గూడ లోని గౌతమి‌ విద్యాక్షేత్ర పాఠశాలలో జాతీయ పతాకానికి‌ గౌరవ వందనం చేస్తున్న డైరెక్టర్ ‌శ్వేతా రెడ్డి

ప్రపంచ మానవ హక్కుల సంఘం‌ ఆధ్వర్యంలో..
చందానగర్ పీజేఆర్ స్టేడియం వద్ద ప్రపంచ మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రపంచ మానవ హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర చైర్మన్ తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి జాతీయ‌‌ జెండాను ఆవిష్కరించారు. మనకు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లయినా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూనే ఉన్నాయని, కాబట్టి ప్రజలందరిని చైతన్యవంతం చేసి వారికి హక్కులపై అవగాహన కల్పించడంలో ప్రపంచ మానవ హక్కుల సంఘం ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వేదం నరేష్, ప్రపంచ మానవ హక్కుల సంఘం రంగారెడ్డి జిల్లా కోఆర్డినేటర్ కొమ్ముల శ్యాము, రంగారెడ్డి జిల్లా సెక్రెటరీ బేగరి చెన్నయ్య, బేకరీ ఆనంద్, కొమ్ముల ఎల్లయ్య, అబ్బురబోయిన రవి, తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచ మానవ హక్కుల సంఘం రాష్ట్ర చైర్మన్ తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించిన దృశ్యం

రాయదుర్గం‌ పోలీస్ స్టేషన్ పరిధిలో స్వాతంత్ర్య ‌దినోత్సవ వేడుకలు ఘనంగా‌ జరిగాయి. ఎస్ హెచ్ ఓ జాతీయ‌ జెండాను ఎగరవేసి గౌరవ వందనం సమర్పించారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ‌రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో దేశ చిత్రపటంతో మహిళా‌ పోలీస్ సిబ్బంది

మియాపూర్ బస్టాప్ వద్ద టూ వీలర్స్ బైక్ మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎండీ అన్వర్ షరీప్ జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ఇలియాస్ షరీప్, మహేందర్ ముదిరాజ్, ఎండీ‌ ఖాజా, ఎండీ వజీర్, సయ్యద్ మోసిన్, రాజు తదితరులు ఉన్నారు.

మియాపూర్ బస్టాప్ వద్ద జాతీయ పతాకాన్ని ఎగరవేస్తున్న ఎండీ అన్వర్ షరీప్

సరస్వతీ విద్యా మందిర్ లో..
చందానగర్ డివిజన్ పరిధిలోని సరస్వతి విద్యా మందిర్ లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా మూగల ప్రతాప రెడ్డి హాజరై జాతీయ పతాకావిష్కరణ చేశారు. భావి భారత భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని ఉద్బోధ చేశారు. ఉపాధ్యాయులు వ్యాపార దృక్పథంతో కాకుండా అంకిత భావంతో విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో విద్య అందించాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు 75వ ఆజాద్ అమృత్ మహోత్సవ జ్ఞాపికగా పెన్నులు, పెన్సిళ్ళతో కూడిన బాక్సులను అందించారు. ఈ కార్యక్రమంలో లయన్ ప్రేమ్ కుమార్, అశోక గౌడ్, దుర్గా మహేశ్వర రావు, శ్రీపాల్ రెడ్డి, పాఠశాల కార్యదర్శి మూగల రఘునందన్ రెడ్డి, సహకార్యదర్శి రామచంద్ర రెడ్డి, పాఠశాల కోశాధికారి నాగభూషణ రావు, సభ్యులు సుధీప్ రెడ్డి, హెచ్ఎం అరుణ పాల్గొన్నారు.

సరస్వతీ విద్యా మందిర్ లో జెండా వందనం చేస్తున్న దృశ్యం

హఫీజ్ పేట్ డివిజన్ లో…
స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా హఫీజ్ పేట్ డివిజన్, ఓల్డ్ హఫీజ్ పేట్ గ్రామంలోని హఫీజ్ పేట్ వార్డ్ కార్యాలయంలో మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ తో కలిసి హఫీజ్ పేట్ డివిజన్ కార్పొరేటర్ వి.పూజిత జగదీశ్వర్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించడం కోసం ఎందరో స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను త్యాగం చేశారన్నారు. స్వాతంత్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహనీయులను స్మరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, వార్డ్ సభ్యులు,ఏరియా సభ్యులు,బస్తి కమిటీ సభ్యులు,మహిళలు,యువకులు తదితరులు పాల్గొన్నారు.

హఫీజ్ పేట్ డివిజన్ వార్డు కార్యాలయంలో జెండా‌వందనం చేస్తున్న కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్

హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో..
హఫీజ్ పేట్ లోని హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు‌ చేసిన త్రివర్ణ పతాకాన్ని స్థానిక కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్, బాబు, వెంకటేష్ గౌడ్, కుమ్మరి శ్రీనివాస్, నిమ్మల శేఖర, బౌలింగ్ గౌతమ్ గౌడ్, సుదర్శన్,కనకమామిడి నరేందర్ గౌడ్, సురేందర్ గౌడ్, రామకృష్ణ,మానై వెంకటేష్, ఆనంద్, జితేందర్ యాదవ్, కుమ్మరి శ్రీశైలం, పులి సాయికుమార్, దేవేందర్ ముదిరాజ్, తలారి పాండు, హఫీజ్ పేట్ గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో జెండావిష్కరణ చేసిన‌ కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్

హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలో ఆయా కాలనీలలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ‌బాలింగ్ గౌతమ్ గౌడ్ పాల్గొన్నారు. ప్రకాష్ నగర్ కాలనీ, హఫీజ్ పెట్ సగర సంఘం, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, హఫీజ్ పేట్ స్టేషన్, బీఎస్‌జీ ఆటో స్టాండ్, మియాపూర్ ఎక్స్ రోడ్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఆవిష్కరించారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో చిన్నారులకు బిస్కెట్లు అందజేస్తున్న టీఆర్ఎస్ ‌డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్

బిజెవైఎం ఆధ్వర్యంలో..
హఫీజ్ పేట్ డివిజన్, ఓల్డ్ హఫీజ్ పేట్ విలేజ్ చౌరస్తాలో బిజెపి యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కైతాపురం జితేందర్ ఆధ్వర్యంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జాతీయ జెండాను ఎగరవేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఎనిమిది సంవత్సరాలుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాల పేదలకు సంక్షేమ పథకాలు రూపొందించి వారికి చేరే విధంగా కృషి చేస్తున్నారని జితేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా గీతా సెల్ కన్వీనర్ రవి గౌడ్, బిజెపి జిల్లా మజ్దూర్ మోర్చా అధ్యక్షులు వర ప్రసాద్, బిజెపి హఫీజ్ పేట్ డివిజన్ ప్రధాన కార్యదర్శి బాబు రెడ్డి, బిజెపి హఫీజ్ పేట్ డివిజన్ ఓబీసీ మోర్చా అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్, డివిజన్ ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు అశోక్, రవి ముదిరాజ్, బిజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యులు శివాజీ, బీజేవైఎం హఫీజ్ పేట్ డివిజన్ ప్రధాన కార్యదర్శి మహేష్ గౌడ్, బీజేవైఎం నాయకులు ఆకాష్ గౌడ్, బిజెపి నాయకులు సలీమ్, జానీ తదితరులు పాల్గొన్నారు.

హఫీజ్ పేట్ గ్రామంలో జాతీయ పతాకావిష్కరణ చేసిన బిజెవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి జితేందర్

నల్లగండ్లలో..
నల్లగండ్ల గ్రామంలోని శ్రీ కృష్ణ యూత్ కార్యాలయంలో శ్రీ కృష్ణ యూత్ వ్యవస్థాపకులు, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ కృష్ణ యూత్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, అడ్వైజర్ యాదగిరి, రాజు, మనోజ్, గిరి, ప్రవీణ్, శ్రీ కృష్ణ యూత్ అధ్యక్షులు జయ సాయి, గౌరవ అధ్యక్షులు లక్ష్మణ, శివ కుమార్, బాలకృష్ణ, బాలరాజు ముదిరాజ్, ప్రదీప్, భాస్కర్, యూత్ నాయకులు రాజు,‌ సతీష్, లక్ష్మణ, మధు యాదవ్, సాయి తదితరులు పాల్గొన్నారు.

నల్లగండ్ల లో శ్రీ కృష్ణ యూత్ అసోసియేషన్ సభ్యులతో కలిసి జెండా వందనం చేస్తున్న మాదాపూర్ ‌కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్

కొండాపూర్ డివిజన్ లో…
75వ స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల సందర్భాన్ని పురస్కరించుకొని కొండాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో, బస్తీలలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాల‌ను కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ ఎగరవేసి గౌరవ వందనం చేశారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీ, లక్జారియా విల్లాస్, అంజయ్య నగర్, సిద్ధిక్ నగర్, బంజారా నగర్, ఓల్డ్ పీజేఆర్ నగర్, న్యూ పీజేఆర్ నగర్, రాఘవేంద్ర కాలనీ, రాజా రాజేశ్వరీ కాలనీ, శ్రీనివాస్ కాలనీ, మార్తాండ్ నగర్, హనీఫ్ కాలనీ, ప్రేమ్ నగర్ ఏ బ్లాకు, ప్రేమ్ నగర్ బి బ్లాకులలో స్థానిక నాయకులు, ప్రజలతో కలసి జాతీయ పతాకాన్ని ఎగరవేసి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో మంది త్యాగ ధనుల త్యాగ ఫలమే ఈ స్వతంత్ర స్వేచ్చ గాలులని, ఆ మహనీయులందరిని పేరు పేరునా గుర్తు చేసుకుంటూ, వారికి ఘనమైన నీరజనం అర్పించాలని కార్పొరేటర్ హమీద్ పటేల్ కోరారు.

కొండాపూర్ డివిజన్ లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న‌ కార్పొరేటర్ హమీద్ పటేల్

చందానగర్ డివిజన్ లో..
చందానగర్ డివిజన్ పరిధిలో స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి ఆయా కాలనీలలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. చందానగర్ గాంధీ విగ్రహం వద్ద చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు మాజీ కార్పోరేటర్ అశోక్ గౌడ్, లక్ష్మీనారాయణ గౌడ్, రవీందర్ రావు, మిర్యాల రాఘవ రావు, గురు చరణ్ దూబే , సుప్రజా ప్రవీణ్ , వెంకట్ రావు , ఓ వెంకటేష్ , పులిపాటి నాగరాజు, రవీందర్ రెడ్డి, వరలక్ష్మి రెడ్డి, హరిత, అక్బర్ ఖాన్, అంజద్ పాషా, యూసుఫ్ పాషా, నరేందర్ భల్లా, దాస్, కార్తీక్ గౌడ్, యశ్వంత్, హరీష్ రెడ్డి, అమిత్ దుబే, సికేందర్, శ్రీకాంత్, ప్రీతం, ప్రవీణ్, ముఖేష్, గిరి, రాజశేఖర్ రెడ్డి, ఇమ్రాన్, అఫ్సర్, ఉమా శంకర్, కాదర్, ఉదయ్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

చందానగర్ గాంధీ విగ్రహం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి

టీఆర్ఎస్ చందానగర్ డివిజన్ యువ నాయకులు గుండోజు శ్రీనివాస్ చారీ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు‌ ఘనంగా నిర్వహించారు. చందానగర్ ఓల్డ్ ముంబై రోడ్డులో మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ గౌడ్, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు దొంతి కార్తీక్ గౌడ్ పాల్గొని జాతీయ‌ జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బి.‌లృష
కృష్ణదాస్, ప్రవీణ్, యశ్వంత్ కోనేరు,‌ కుమార్ యాదవ్, గిరిబాబు, గణనాయక యూనియన్, నేతాజీ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో చందానగర్ డివిజన్ టీఆర్ఎస్ యూత్ విభాగం సభ్యులు

ధర్మపురి క్షేత్రంలో..
శ్రీ ధర్మపురి క్షేత్రంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా‌ జరిగాయి. పెన్నార్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ పి వి రావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. మన భారతదేశ సమగ్రత గురించి, ఆర్థిక అభివృద్ధి గురించి ప్రసంగించారు. అనంతరం ఆలయ వ్యవస్థాపకురాలు భారతీయం సత్యవాణి జాతీయ పతాకం ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పి వి రావు సతీమణి, గురుకుల విద్యార్థులు, ఆలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ధర్మపురి క్షేత్రంలో నిర్వహించిన జెండా పండగలో భారతీయం సత్యవాణి, పీవీ రావు, తదితరులు

నేతాజీ నగర్ కాలనీ కాలనీ అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నేతాజీ నగర్ కాలనీ ఉపాధ్యక్షులు రాయుడు, కమ్మర్ పాషా, కె.నరసింహ యాదవ్, కాలనీ యూత్ ప్రెసిడెంట్ బేరి శ్రీనివాస్ యాదవ్, లక్ష్మారెడ్డి, శ్యాంసుందర్, శ్రీకాంత్,ఎండి ఆహాక్, బాలరాజ్ నాయక్, వాసు, గణేష్ నాయక్, బాలరాజ్ సాగర్, నాగరాజు, లవన్ చారి, బేరి చంద్రశేఖర్ యాదవ్, భరత్, అశోక్, సాయి, నితిన్, సత్తి, మహిళలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

నేతాజీ నగర్ లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న భేరి రాంచందర్ యాదవ్

శేరిలింగంపల్లిలోని స్వర మహతి కళా పరిషత్ లో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మిరియాల రాఘవ రావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి పిల్లలలో జాతీయ భావాలను పెంపొందించాలని పిలుపునిచ్చారు. సంస్థ అధ్యక్షుడు డా ఆదిత్య కిరణ్, న్యాయవాది వీవీఎస్ లక్ష్మణ కుమార్, జయ ప్రకాష్, అనీష్, తులసి, దేవులపల్లి కుమార్, భూషణ్, కాశీ విశ్వనాథ్, వెంకటలక్ష్మి, నటరాజ్ గుప్త, శ్యామ్, కిషోర్, మనస్విని, లాస్య, మానస్, తిరుమల తదితరులు పాల్గొన్నారు.

స్వర మహతి కళా‌పరిషత్ లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల్లో మాట్లాడుతున్న మిరియాల రాఘవరావు

కాంగ్రెస్ ఆధ్వర్యంలో…
శేరిలింగంపల్లి కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గం ‌కో ఆర్డినేటర్ ఎం. రఘునందన్ రెడ్డి, సీనియర్ నాయకులు జెరిపాటి జైపాల్, కోటిం వినయ్ రెడ్డి, అయాజ్ అహ్మద్ ఖాన్, తదితరులు పాల్గొని జెండావంద‌నం చేశారు.

చందానగర్ లో నిర్వహించిన స్వాతంత్ర్య ‌దినోత్సవ వేడుకల్లో జాతీయ‌ జెండాకు గౌరవ వందనం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here