శేరిలింగంపల్లి, మే 25 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో డాక్టర్ వినీల రావు శిష్య బృందం నిర్వహించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఆద్యంతం అలరించింది. గణేష్ పంచరత్న, బ్రహ్మాంజలి, శివ తాండవం, బృందావన నిలయే , రామాయణ శబ్దం, జతిస్వరం, బాల గోపాల తారంగం, కొలువైతివా రంగ సాయి, భో శంభో, దశావతారం, హిందోళ తిల్లాన అంశాలను కళాకారులు రుత్విజ, శాన్వి, వివేకా, సమ్రితి, ఆరాధ్య, సిరి చందన, గౌతమి, శిరీష, రితిక, విశీతా, సింధు, సాయి సరయు, వైష్ణవి, చరిత కృష్ణ, స్రవంతి, దివ్య, గాయత్రీ ప్రదర్శించి మెప్పించారు. గౌరీ శంకర్ ముఖ్య అతిధిగా హాజరై కళాకారులను అభినందించారు.